అమెరికా టెక్ దిగ్గజం Oracle Corporation భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపట్టింది. AI పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇందులో ఇండియా లోనే దాదాపు 12 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు.
అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే… చాలామందికి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 5–6 గంటల సమయంలోనే ఇమెయిల్ ద్వారా టెర్మినేషన్ లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే ఉద్యోగం నుంచి రిలీవ్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ లేఆఫ్స్ ఎక్కువగా క్లౌడ్, కంప్యూటింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం చూపినట్లు సమాచారం. ముఖ్యంగా ఇండియా, అమెరికా, మెక్సికోలోని ఉద్యోగులు ఎక్కువగా దెబ్బతిన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ (X) లో ఉద్యోగులు తమ పరిస్థితిని షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 40% మందిని తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. అనుభవం ఉన్న ఉద్యోగులను కూడా ఒక్కసారిగా తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ నిర్ణయానికి ప్రధాన కారణం AI పై భారీ పెట్టుబడులేనని తెలుస్తోంది. డేటా సెంటర్ల విస్తరణ కోసం ఖర్చులు తగ్గించే భాగంగా ఈ లేఆఫ్స్ జరిగాయి. ఇప్పటికే Amazon, Meta వంటి సంస్థలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.
