మన పత్రిక, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.3000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియరెన్స్ ఇవ్వడం విశేషంగా మారింది. ‘రామ’ పేరుతో రాబోతున్న ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏప్రిల్ 2న విడుదలకు మార్గం సుగమమైంది.
ఇక ఈ టీజర్ నిడివి 2 నిమిషాల 38 సెకన్లుగా ఉండగా, యూనివర్సల్ (‘U’) సర్టిఫికేట్ పొందింది. దీంతో అన్ని వయసుల ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించవచ్చు. ఇప్పటివరకు చిత్రబృందం టైటిల్ వీడియోతో పాటు 3 నిమిషాల 3 సెకన్ల నిడివి గల ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ క్లిప్‌ను మాత్రమే విడుదల చేసింది. భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో వచ్చిన ఆ వీడియోలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రాబోయే టీజర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సినీ అభిమానుల్లో మరింత పెరుగుతోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
