మన పత్రిక, హైదరాబాద్: ఏప్రిల్ (2026) నెలలో బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే కస్టమర్లకు ముఖ్య గమనిక. రాబోయే ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఆర్థిక సంవత్సర ముగింపు, వరుస పండుగలు, ప్రభుత్వ మరియు వారాంతపు సెలవులు కలుపుకుని ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం సెలవులు ఉండనున్నాయి.
ఈ 14 రోజుల సెలవుల్లో 4 ఆదివారాలు, 2 శనివారాలు (రెండో, నాలుగో) కలిసి ఉన్నాయి. వీటితో పాటు ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సర ముగింపు (Bank Closing), మౌండీ థర్స్ డే, గుడ్ ఫ్రైడే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, అక్షయ తృతీయ, బసవ జయంతి, బైసాఖీ, తమిళ మరియు బెంగాలీ నూతన సంవత్సరాలు, బోహాగ్ బిహు, విషు, హిమాచల్ దినం, గరియా పూజ తదితర పండుగలు, జాతీయ సెలవుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు వర్తించనున్నాయి.
అయితే, బ్యాంకు బ్రాంచ్‌లు మూసివేసినప్పటికీ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆన్‌లైన్ సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ లావాదేవీలు 24 గంటల పాటు యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. కస్టమర్లు తమ బ్రాంచ్‌లకు వెళ్లేముందు తమ రాష్ట్రంలో ఆరోజు సెలవు ఉందో లేదో సరిచూసుకుని వెళ్లడం ఉత్తమం.
