మన పత్రిక, మిర్యాలగూడ: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ప్రాణదాతగా నిలుస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల కోసం ఫోన్ చేయగానే తక్షణమే స్పందిస్తూ ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మంగళవారం స్థానిక జ్యోతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక రోగికి రక్తం అవసరం ఉందని తెలియగానే, జానకిరామ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇలా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం తనకు ఇది 11వ సారి అని ఆయన తెలిపారు. “రక్తదానం చేయండి.. ప్రాణదాతలు అవ్వండి” అనే నినాదంతో యువత ముందుకు రావాలని, అత్యవసర సమయంలో రోగులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
ఈ కార్యక్రమంలో జీజేఆర్ (GJR) యువసేన సభ్యులు రాథోడ్ శ్రీనివాస్, యశ్వంత్, తాళ్లపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
