మన పత్రిక, హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం.. నేటి (మార్చి 25, 2026 – బుధవారం) రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.)
- మేష రాశి: ఈ రోజు చంద్రబలం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభదాయకం. సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తే మేలు. (లక్కీ నంబర్: 1, కలర్: ఎరుపు)
- వృషభ రాశి: పనుల్లో అడ్డంకులు ఎదురుకావచ్చు. ఆర్థిక విషయాల్లో, వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. గణపతి ఆరాధనతో ప్రశాంతత లభిస్తుంది. (లక్కీ నంబర్: 6, కలర్: పచ్చ)
- మిథున రాశి: ఆలోచనల్లో చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు ప్రముఖుల పరిచయాలు, ధనలాభం కలుగుతుంది. హనుమంతుడి దర్శనం శుభకరం. (లక్కీ నంబర్: 5, కలర్: కాషాయం)
- కర్కాటక రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో చిన్న ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో ఉంటే సానుకూలత. అనవసర వాదనలు, ఖర్చులకు దూరంగా ఉండాలి. అమ్మవారి ప్రార్థన మేలు చేస్తుంది. (లక్కీ నంబర్: 2, కలర్: పసుపు)
- సింహ రాశి: ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పెద్దల సహకారంతో పూర్తవుతాయి. వ్యాపారులకు ధనలాభం. ఉద్యోగులు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది. (లక్కీ నంబర్: 3, కలర్: బూడిద)
- కన్య రాశి: పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆగిపోయిన బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు. ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయం తీసుకుంటారు. వినాయకుడి పూజతో విఘ్నాలు తొలగుతాయి. (లక్కీ నంబర్: 5, కలర్: లేత పచ్చ)
- తుల రాశి: తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఉద్యోగులకు అధికారులతో కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. వ్యాపారులకు శ్రమతో కూడిన లాభాలు. సర్దుబాటు ధోరణి అవసరం. అమ్మవారి ఆరాధన దారి చూపుతుంది. (లక్కీ నంబర్: 6, కలర్: గులాబీ)
- వృశ్చిక రాశి: ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. నమ్మిన వ్యక్తులపై అభిప్రాయాలు మారొచ్చు. వ్యాపారులు భారీ పెట్టుబడులకు దూరం ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు, మధ్యవర్తిత్వాల్లో అప్రమత్తత. వెంకటేశ్వర స్వామి పూజ శుభకరం. (లక్కీ నంబర్: 9, కలర్: బంగారు వర్ణం)
- ధనుస్సు రాశి: చంద్రబలం వల్ల శుభఫలితాలు. తలపెట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. వ్యాపారులకు లాభాలు, కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. దత్తాత్రేయ స్వామి స్మరణ మేలు. (లక్కీ నంబర్: 6, కలర్: బంగారు పసుపు)
- మకర రాశి: అద్భుతమైన రోజు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. వ్యాపారులకు సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుంది. నూతన వాహన యోగం ఉంది. శివగాయత్రి మంత్ర జపంతో సత్ఫలితాలు. (లక్కీ నంబర్: 8, కలర్: నీలం)
- కుంభ రాశి: ఆలోచనల్లో కొంత అస్థిరత ఉంటుంది. ఉద్యోగులు కఠిన పరిస్థితులను మనోనిబ్బరంతో దాటుతారు. వ్యాపారులకు ఆదాయం పరవాలేదు. మీడియా రంగం వారికి గుర్తింపు. అమ్మవారి దర్శనం శుభకరం. (లక్కీ నంబర్: 4, కలర్: మయూర నీలం)
- మీన రాశి: పాక్షిక అనుకూలత. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ముఖ్యమైన పనులు ఆగిపోయి ఆందోళన కలిగిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రశాంతతనిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణంతో శుభఫలితాలు. (లక్కీ నంబర్: 7, కలర్: తెలుపు)
పంచాంగ వివరాలు:
Advertisement
- సూర్యోదయం: ఉదయం 6:20
- సూర్యాస్తమయం: సాయంత్రం 6:24
- తిథి: సప్తమి (మధ్యాహ్నం 1:52 వరకు), తదుపరి అష్టమి.
- దుర్ముహూర్తం: ఉదయం 11:58 – మధ్యాహ్నం 12:46
- రాహుకాలం: మధ్యాహ్నం 12:22 – 1:52
ఇవి కూడా చదవండి :
Advertisement
