Advertisement

కామారెడ్డి వరద బాధితులకు ఆర్థిక సహాయం

మన పత్రిక వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు పంపిన నివేదిక ఆధారంగా ఈ నిధులు మంజూరయ్యాయి. నగరంలో పాక్షికంగా దెబ్బతిన్న 67 ఇళ్లకు ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున, పూర్తిగా దెబ్బతిన్న 67 ఇళ్ల మరమ్మతుకు ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. వరద బాధితులందరికీ సమన్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement