మన పత్రిక, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రైవేట్ బస్సు మొత్తం 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు బయలుదేరింది. ప్రయాణంలో భాగంగా రాత్రి రెండు గంటల సమయంలో గన్నారం వద్దకు రాగానే బస్సు అకస్మాత్తుగా బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి :
- NHPC Trainee Engineer Recruitment 2026: ఎన్‌హెచ్‌పీసీలో 81 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ
- మూసీ ప్రాజెక్టుపై పౌరసమాజానికి సీఎం రేవంత్ ప్రజెంటేషన్
- CBSE Class 10 Results 2026 : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2026 ఎప్పుడంటే?
- Brahmamudi March 14 Episode: రాఖీ నుంచి ఇందును కాపాడిన రాజు.. ఆస్తి లెక్కల్లో రేఖ
- Gold Rate Today – March 14, శనివారం బంగారం ధరలు!
