మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర ధారావాహిక ‘గుండె నిండా గుడి గంటలు’ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్వతి కూతురు సుమతి పెళ్లి చూపులు జరగ్గా, పెళ్లి తర్వాత కూడా తాను ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా ఉంటానన్న షరతుపై ఆమె ఈ వివాహానికి అంగీకరించింది. అబ్బాయి తరపు వారు కూడా ఎలాంటి కట్నకానుకలు వద్దని స్పష్టం చేశారు. పెద్దల్లుడు బాలు తరహాలోనే తాను కూడా కుటుంబానికి అండగా ఉంటానని కొత్త అల్లుడు పార్వతికి ధైర్యం చెప్పాడు.
మరోవైపు రోహిణికి దినేష్ నుంచి బెదిరింపులు తీవ్రమయ్యాయి. నెలలోగా లక్ష రూపాయలు ఇవ్వకపోతే నేరుగా భర్త దగ్గరికే వచ్చి డబ్బులు అడుగుతానని అతడు హెచ్చరించాడు. విద్య ద్వారా దినేష్ చేసిన ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలో అత్త ప్రభావతి పక్కనే ఉండటంతో రోహిణి ఇబ్బంది పడింది. ఆ కాల్ ఎవరిదన్న ప్రభావతి ప్రశ్నకు సమాధానంగా.. తన తండ్రి ఆస్తి వ్యవహారాలు చూసే అకౌంటెంట్ అని, తమకు రూ. 300 కోట్ల ఆస్తి రానుందని రోహిణి అబద్ధం చెప్పడంతో ప్రభావతి సంతోషంతో ఆశ్చర్యపోయింది.
ఇటు బాలు, మీనా కారులో ప్రయాణిస్తూ పెళ్లికి ముందు కాబోయే భాగస్వామి గురించి తాము ఎలాంటి కలలు కన్నామన్న విషయాలను పంచుకున్నారు. మరోవైపు మనోజ్ స్నేహితుడు మణికంఠ అతనికి ఓ ఇంటర్నేషనల్ డీలర్‌షిప్ ఆఫర్ గురించి వివరిస్తాడు. కోట్ల రూపాయల వ్యాపారం సొంతం చేసుకోవడానికి, ఆ డీలర్‌ను ఆకట్టుకునేలా తమ వెడ్డింగ్ యానివర్సరీ పార్టీని ఘనంగా నిర్వహించాలని రోహిణి, మనోజ్ నిర్ణయించుకుంటారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
