పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న భారీ మాస్ ప్రాజెక్ట్ Ustaad Bhagat Singh నుంచి ఫైనల్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ తుఫాన్ సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.
ఇప్పటికే మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను మార్చి 14న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్ లో పవర్ స్టార్ చేతిలో గన్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. “మాస్ మూడ్ లో పవన్” అంటూ పోస్టర్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది.
ఆల్రెడీ రెండు రోజుల కింద వచ్చిన ట్రైలర్ టీజ్ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అయింది. ఇక ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ ఎలా కట్ చేశాడో అన్న ఆసక్తి ఇప్పుడు ఫ్యాన్స్‌లో మరింత పెరిగింది. యాక్షన్, డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్‌తో ట్రైలర్ థియేటర్లను షేక్ చేస్తుందా అన్నది చూడాలి. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా (Sreeleela) శ్రీలీల మరియు Raashii Khanna (రాశిఖన్నా) నటిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను Mythri Movie Makers నిర్మించగా, ఫైనల్ గా మార్చి 19న ఉగాది స్పెషల్ గా థియేటర్లలో రచ్చ చేయడానికి ఉస్తాద్ రెడీ అవుతున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
