మన పత్రిక, వెబ్‌డెస్క్
భారతీయ స్టేట్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఆగస్టు 4 మరియు 5, 2025న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను SBI అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
state bank of india po prelims result 2025
మొత్తం 541 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు SBI వెబ్‌సైట్‌లో “Recruitment Results” విభాగానికి వెళ్లి, CRPD/PO/2025-26/04 నోటిఫికేషన్ కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్ష సెప్టెంబర్ 2025లో నిర్వహించనున్నారు. మెయిన్స్ అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. మెయిన్స్ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
sbi po prelims result 2025 link
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
