మన పత్రిక వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోంది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్’ (NIB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు (మొత్తం 44 పోస్టులు):
Advertisement
- లేబొరేటరీ టెక్నీషియన్: 25 పోస్టులు.
- జూనియర్ సైంటిస్ట్: 12 పోస్టులు.
- అసిస్టెంట్-II: 2 పోస్టులు.
- సైంటిస్ట్ గ్రేడ్-II: 2 పోస్టులు.
- సైంటిస్ట్ గ్రేడ్-III (Vet): 1 పోస్టు.
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 1 పోస్టు.
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 1 పోస్టు.
అర్హతలు & వయోపరిమితి:
- విద్యార్హతలు: పోస్టును బట్టి 12వ తరగతి (ఇంటర్మీడియట్), డిగ్రీ (సైన్స్/ఆర్ట్స్/కామర్స్), ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా/డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి.
- వయోపరిమితి: అసిస్టెంట్-II పోస్టుకు గరిష్ట వయసు 27 ఏళ్లు. లేబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ సైంటిస్ట్ సహా ఇతర గ్రూప్ పోస్టులకు 30 ఏళ్లు. సైంటిస్ట్ పోస్టులకు 35 నుంచి 45 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 09 మార్చి 2026.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08 ఏప్రిల్ 2026.
- హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ: దరఖాస్తు చేసుకున్న ఫారమ్‌ను ప్రింట్ తీసి, అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి 14 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5:30) లోపు పోస్ట్ ద్వారా NIB ఆఫీసుకు పంపాలి.
- అధికారిక వెబ్‌సైట్: nib.gov.in
ఇవి కూడా చదవండి :
- TCS Recruitment : టాటాలో మల్టిపుల్ పొజిషన్స్ లో ఉద్యోగాలు..
- కంచే చేను మేసిన చందం.. చాట్‌జీపీటీతో మాస్ కాపీయింగ్, 81 మంది సిబ్బంది సస్పెండ్!
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికల మధ్య సంచలన ప్రకటన!
- తెలంగాణ విద్యార్థినులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్: త్వరలోనే ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు!
- బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడే కొనడం మంచిదా?
Advertisement
