మన పత్రిక వెబ్‌డెస్క్ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ (HDFC) తన కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. ఒకవైపు రుణ ఆధారిత వడ్డీ రేట్లను (MCLR) తగ్గిస్తూ సామాన్యులకు ఈఎంఐ భారాన్ని తగ్గించిన బ్యాంక్, మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచుతూ డిపాజిటర్లకు లాభం చేకూర్చింది. సవరించిన ఈ కొత్త రేట్లు నేటి (మార్చి 7) నుంచే అమల్లోకి వచ్చాయి.
తగ్గనున్న ఈఎంఐ భారం (MCLR కోత) అన్ని టెన్యూర్లపై MCLR రేట్లను కనీసం 5 నుంచి గరిష్ఠంగా 10 బేసిస్ పాయింట్ల (bps) వరకు బ్యాంక్ తగ్గించింది. ఈ ఎంసీఎల్ఆర్కు లింక్ అయిన ఫ్లోటింగ్ రేటు లోన్లపై కస్టమర్ల ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ తగ్గే అవకాశం ఉంది.
- ఓవర్ నైట్, 1 నెల: 8.25% నుంచి 8.15% కు తగ్గింపు (10 bps కోత).
- 3 నెలలు: 8.30% నుంచి 8.25% కు తగ్గింపు (5 bps కోత).
- 6 నెలలు, 1 ఏడాది: 8.40% నుంచి 8.35% కు తగ్గింపు. (కన్జ్యూమర్ లోన్లు ఎక్కువగా ఏడాది టెన్యూర్‌తోనే లింక్ అయి ఉంటాయి).
- 2 ఏళ్లు: 8.50% నుంచి 8.45% కు తగ్గింపు.
- 3 ఏళ్లు: 8.60% నుంచి 8.55% కు తగ్గింపు.
ఎఫ్డీలపై పెరిగిన వడ్డీ (FD Rates Hike) లోన్ వడ్డీలు తగ్గించిన బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్లపై నిర్దిష్ట టెన్యూర్లకు వడ్డీ రేట్లను పెంచింది.
- 3 సంవత్సరాల ఒక రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల వ్యవధి గల ఎఫ్డీలపై వడ్డీ రేటును సాధారణ కస్టమర్లకు 6.40% నుంచి 6.50% కి పెంచింది.
- ఇదే టెన్యూర్‌పై సీనియర్ సిటిజన్లకు 6.90% నుంచి 7% కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి :
- అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!
- పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు బంద్.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ కీలక నిర్ణయం!
- ఎస్సెస్సీ జేఈ టైర్-1 స్కోర్ కార్డ్.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
- తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025 ప్రకటన.. | Gaddar Film Awards 2025 Announced
