మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ‘గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025’ (2024 సంవత్సరానికి గాను) విజేతల జాబితాను ప్రకటించింది. నంది అవార్డుల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ పురస్కారాలను అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది నుంచి అక్కినేని నాగేశ్వరరావు, సి.నారాయణ రెడ్డి పేర్లతో కొత్త అవార్డులను ప్రవేశపెట్టడంతో పాటు, స్పెషల్ జ్యూరీ అవార్డులను 6 నుంచి 8కి పెంచారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి, పైడి జైరాజ్ జాతీయ పురస్కారానికి కమల్ హాసన్ ఎంపికయ్యారు. ‘తండేల్’ చిత్రంలోని నటనకు నాగ చైతన్య, ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి రష్మిక మందన్న ఉత్తమ నటీనటులుగా నిలిచారు.
ప్రధాన జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు:
- ఎన్టీఆర్ జాతీయ అవార్డు: మెగాస్టార్ చిరంజీవి
- పైడి జైరాజ్ జాతీయ అవార్డు: కమల్ హాసన్
- బి.ఎన్.రెడ్డి ఫిల్మ్ అవార్డు: సింగీతం శ్రీనివాసరావు (సీనియర్ దర్శకుడు)
- నాగిరెడ్డి & చక్రపాణి అవార్డు: సి. అశ్వనీదత్ (వైజయంతి మూవీస్)
- టీ.ఎల్. కాంతారావు అవార్డు: ఆర్. నారాయణ మూర్తి
- రఘుపతి వెంకయ్య అవార్డు: రమేష్ ప్రసాద్ (ప్రసాద్ గ్రూప్)
- సి. నారాయణ రెడ్డి అవార్డు: సుద్దాల అశోక్ తేజ
- అక్కినేని నాగేశ్వరరావు అవార్డు: జయసుధ
ఉత్తమ చిత్రాలు:
- ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయ్
- ద్వితీయ ఉత్తమ చిత్రం: దండోరా
- తృతీయ ఉత్తమ చిత్రం: ప్రీ వెడ్డింగ్ షో
- జాతీయ సమగ్రత చిత్రం: తండేల్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ సామాజిక చిత్రం: కోర్టు
- ఉత్తమ పర్యావరణ చిత్రం: ఈగ్వా
- బెస్ట్ డెబ్యూ ఫిల్మ్: లిటిల్ హార్ట్స్
- ఉత్తమ బాలల చిత్రం: అనగనగా
ఉత్తమ నటీనటులు & సాంకేతిక నిపుణులు:
- ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
- ఉత్తమ దర్శకుడు: సాయిలు కంపాటి
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: శివాజీ (కోర్టు)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: భూమిక (యూఫోరియా)
- ఉత్తమ హాస్యనటుడు: శ్రీ కృష్ణ తేజ రెడ్డి (జిగ్రీస్)
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: మాస్టర్ రోహన్ రెడ్డి (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ సంగీత దర్శకుడు: మార్కే కే రూబిన్ (దండోరా)
- బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్: అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయ్)
- బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్: సాహితి చాగంటి (కన్నప్ప)
- బెస్ట్ స్టోరీ రైటర్: గుణశేఖర్ (యూఫోరియా)
- బెస్ట్ స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
- బెస్ట్ లిరిసిస్ట్: నంద కిషోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: మిరాయ్
- బెస్ట్ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
- బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (ఛాంపియన్)
- బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్
- బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్: వై.గోవింద రాజు
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ సోనావాణి, అజయ్ కుమార్ నంభాల (ఛాంపియన్)

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
