మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్ లో మరో కుర్ర హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యంగ్ హీరో సాయి శ్రీనివాస్ వివాహం నిశ్చయమైనట్లు ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్‌కే చెందిన న్యాయవాదుల కుటుంబానికి చెందిన ‘కావ్య రెడ్డి’ అనే యువతితో ఆయన ఏడడుగులు నడవనున్నారని సమాచారం. ఆమె తాత రిటైర్డ్ జడ్జి కాగా, తండ్రి ప్రస్తుతం లాయర్ గా కొనసాగుతున్నారు. ఈ వారంలోనే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ వంటి కొత్త సినిమాలతో బిజీగా ఉన్న శ్రీనివాస్.. వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అడుగు వేస్తుండటం ఆయన అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్త.
Advertisement
త్వరలోనే ఈ వివాహంపై బెల్లంకొండ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
