మన పత్రిక వెబ్‌డెస్క్ : విజయవాడలోని విద్యాధరపురం ‘నేషనల్ ప్లే స్కూల్’లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదారేళ్ల వయసున్న ఓ పసిపాప ప్రైవేట్ పార్ట్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది.
చిన్నారి బాత్రూమ్‌లో జారిపడిందని స్కూల్ యాజమాన్యం కట్టుకథ అల్లి తల్లిదండ్రులకు చెప్పి ఆస్పత్రిలో చేర్పించింది. తీరా చూస్తే అవి యాసిడ్ గాయాలని నిర్ధారణ అయ్యింది. పరువు పోతుందనే నెపంతో ఆస్పత్రి బిల్లులు కట్టి యాజమాన్యం తొలుత ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం ఆ చిన్నారి మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పసిపాప భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్కూళ్లలో పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసులు స్పందించి నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
