WhatsApp
Advertisement

BSNL Freedom Plan గడువు పొడిగింపు

మన పత్రిక, వెబ్​డెస్క్

కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఈ నెల 30న ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు BSNL అధికారికంగా ప్రకటించింది.

Advertisement

ఈ ఫ్రీడమ్ ప్లాన్ కింద కేవలం రూ.1కే ఉచిత సిమ్ కార్డ్ లభిస్తుంది. అంతేకాకుండా 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై స్పీడ్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రత్యేకంగా యువత, విద్యార్థులు ఈ ప్లాన్ కు మెప్పు తెలుపుతున్నారు. BSNL సర్వీస్ పొందే ప్రాంతాల్లో ఉన్న వారు ఈ ప్లాన్ కోసం BSNL సెల్యులార్ ఆఫీస్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement