మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా అధికారులు పరీక్ష సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి (ఫిబ్రవరి 19) ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా సిలబస్ వివరాలను ప్రకటించారు.
సిలబస్‌ను డౌన్లోడ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in/ ను సందర్శించాలి. హోమ్ పేజీలోని మెనూలో ‘ఇన్ఫర్మేషన్’ లేదా ‘సిలబస్’ సెక్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు రాసే పరీక్షను బట్టి.. ఇంజినీరింగ్ స్ట్రీమ్ (Engineering Stream) లేదా అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్ (Agriculture & Pharmacy Stream) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే సిలబస్ వివరాలతో కూడిన పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీన్ని విద్యార్థులు ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకుని భద్రపచుకోవచ్చు.
దరఖాస్తుల విషయానికొస్తే.. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము (Fine) లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఆలస్యమైతే రూ.250 నుంచి రూ.10,000 వరకు ఫైన్‌తో మే 2 వరకు అవకాశం కల్పించారు. ఈసారి కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షను నిర్వహించనుంది.
పరీక్ష తేదీలను కూడా అధికారులు ఖరారు చేశారు. మే 4, మే 5 తేదీల్లో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరుగుతాయి. అలాగే మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఇందులో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లేదా ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
