WhatsApp
Advertisement

Kesamudram Municipal Election Results 2026: కేసముద్రంలో ‘టై’ టెన్షన్

మన పత్రిక వెబ్​డెస్క్, మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టకపోవడంతో ఫలితాలు ‘టై’గా ముగిశాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ నెలకొన్న పరిణామం సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది.

మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, ఫలితాలు ఇరు ప్రధాన పార్టీల మధ్య సమానంగా పంపిణీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 8 వార్డుల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ కూడా 8 వార్డుల్లో గెలుపొందింది. మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, ఏ పార్టీ కూడా ఆ సంఖ్యను అందుకోలేకపోయింది. దీంతో ఇక్కడ చైర్మన్ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది.

Advertisement

ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడంలో ఎక్స్-అఫీషియో (Ex-officio) ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఎవరికి ఎక్కువ ఎక్స్-అఫీషియో ఓట్లు ఉంటే వారికే చైర్మన్ గిరీ దక్కే అవకాశం ఉంది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. క్యాంపు రాజకీయాలకు తెరలేపే అవకాశం కనిపిస్తోంది.

Advertisement