పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా నటించిన ‘ఓజి’ (OG) లాస్ట్ ఇయర్ దసరా కి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందే స్టార్ట్ చేసిన సినిమాల్లో “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustad bhagath singh) కూడా ఒకటి. ఈ సినిమాని దాదాపు ఫినిష్ చేసిన పవన్, కొంత పార్ట్ ని టైం దొరికినప్పుడల్లా షూటింగ్ కి వెళ్తూ పూర్తి చేసేసాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ పవన్ బిజీ షెడ్యూల్స్ వల్ల వాయిదా వేస్తూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఉస్తాద్ బాక్స్ ఆఫీస్ పైకి దండెత్తే టైం ని ఫిక్స్ చేసారు మేకర్స్.
మైత్రి మూవీ మేకర్స్ (Mythri movie makers) నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాసేపటికిందే సినిమా రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 26న “ఉస్తాద్ భగత్ సింగ్” ని రిలీజ్ చేస్తున్నట్టు ఒక సాలిడ్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. అయితే నిజానికి మార్చి 27న ఇదే నిర్మాతలు అబ్బాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటిస్తున్న పెద్ది (Peddi) ని రిలీజ్ చేయాలనీ ట్రై చేసినా, చరణ్ ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోట్ అవ్వడంతో, తన ఇంట్లో పిల్లలతో బిజీ అవడం వల్ల పెద్దిని తప్పించి ఉస్తాద్ ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల(Sreeleela), రాశి ఖన్నా (Rashikhanna) హీరోయిన్లుగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ (Devisriprasad) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం ఫినిష్ కాగా, ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్, టీజర్లు, సాంగ్స్ కూడా ఓ రేంజ్ లో హైప్ ని పెంచేసాయి. పవన్ నుండి మరో ఎనర్జిటిక్ బ్లాక్ బస్టర్ వస్తుందని ఇప్పటికే ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి రానున్న ఉస్తాద్ ట్రైలర్ తో అంచనాలను హరీష్ శంకర్ ఎంత పీక్స్ కి తీసుకెళ్తాడో చూడాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
