బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బోర్డర్ 2. రిపబ్లిక్ డే స్పెషల్ గా 23న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని థియేటర్లలో భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. వరుణ్ ధావన్ (Varun dhavan) లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడంతో బోర్డర్ పై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దిల్జీత్ దోసాంజ్ కూడా ప్రత్యేక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా మొదటిరోజు నుండి కూడా అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తుండగా, తాజాగా వీకెండ్ కలెక్షన్ల వివరాలు బయటికి వచ్చాయి.
తాజాగా వచ్చిన అధికారిక లెక్కల ప్రకారం, బోర్డర్ 2 (Border 2) మూవీ నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 250 కోట్ల మార్కును దాటేసింది. ముఖ్యంగా ఇండియాలో అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో పలు రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సోమవారం నాటికి, ఈ సినిమా ఇండియాలో రూ. 180 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రిపబ్లిక్ డే సందర్బంగా ఒక్క సోమవారమే 59 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అలాగే ఓవర్సీస్ లో కూడా 4.3 మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం.
ఇక గతేడాది చివర్లో దురంధర్ తర్వాత బాలీవుడ్ లో మరో సక్సెస్ లేకపోగా, ఈ ఇయర్ బోర్డర్ 2 తో భారీ బ్లాక్ బస్టర్ ని బాలీవుడ్ కొట్టిందని చెప్పాలి. లాంగ్ రన్ లో 500 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈలోపు బాలీవుడ్ లో రికార్డులు సెట్ చేయడానికి దురంధర్ 2 కూడా రెడీ అవుతుంది. ఇటు సౌత్ లో కూడా మరో రెండు నెలల్లో పెద్ది, టాక్సిక్ లాంటి క్రేజీ సినిమాలు రికార్డులు లేపడానికి బాలీవుడ్ పై దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి.
