కోలీవుడ్ లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న మూవీస్ లో ఒకటి “జననాయగన్”. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా అంటూ తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించగా హెచ్ వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. అయితే జన నాయగాన్ (Jana Nayagan) నిజానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది అని తెలిసిందే. మేకర్స్ కూడా ట్రైలర్ లాంచ్ చేసి భారీగా ఈవెంట్ చేసి రిలీజ్ కి రెడీ చేసారు. కానీ చివరి నిమిషంలో సెన్సార్ సమస్యల మూలాన సినిమా రిలీజ్ వాయిదా పడడం జరిగింది. దీంతో మేకర్స్ హై కోర్ట్ వరకు వెళ్లడం జరిగింది.
స్టాలిన్ పార్టీ రాజకీయ ఎత్తుగడతో కావాలని సినిమా రిలీజ్ ని అడ్డుకుంటున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఫిబ్రవరిలో అయినా రిలీజ్ చేయాలని ఎదురుచూస్తూ కోర్టు తుది తీర్పు కోసం మేకర్స్ ఎదురుచూసారు. తీర్పు సినిమాకి అనుకూలంగానే వస్తుందని భావించి ప్రొడ్యూసర్లు ఓవర్సీస్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఫిబ్రవరి 6 విడుదల తేదీని ఫిక్స్ కొమ్మన్నట్టు న్యూస్ వచ్చింది. కానీ ఫైనల్ గా చివరి నిమిషంలో తమిళనాడు న్యాయస్థానం రిలీజ్ రద్దు చేసి ట్విస్ట్ ఇచ్చింది.
సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసి మళ్ళీ విచారణ జరపాలని సూచించడంతో మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఆల్రెడీ యుఎ సర్టిఫికెట్ తెచ్చుకున్న జననాయగన్ ని రద్దు చేసి మళ్ళీ సెన్సార్ విచారణ ఏం జరపాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటు నెట్టింట జననాయగన్ రిలీజ్ మార్చి కి షిఫ్ట్ అయిందని రూమర్లు వస్తున్నాయి. మరి ఉన్న అవాంతరాలన్నీ దాటుకుని జననాయగన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
