టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లపై ఒకరితో క్లోజ్ గా మూవ్ అయితే అప్పటికప్పుడు ఎన్నో రకాల రూమర్లు నెట్టింట చక్కర్లు కొట్టడం కామనే. అందులో కొన్ని నిజమైనవి ఉన్నాయి, చాలా వరకు అవాస్తవాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా మరో టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ కి ఈ రూమర్ల గోల ఎక్కువైంది. ఆమె ఎవరో కాదు డింపుల్ హయతి(Dimple hayathi). ఐటెం సాంగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ తెలుగు హీరోయిన్ టాలీవుడ్ లో మినిమం రేంజ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha mahashayulaku visgnapti) సినిమాలో హీరోయిన్ గా నటించింది డింపుల్.
ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. కాకపోతే కలెక్షన్ల పరంగా కాస్త డల్ గా నడుస్తుంది. ఇదిలా ఉండగా డింపుల్ హయతి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగా, డింపుల్ హయతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డింపుల్ కి “డేవిడ్”(David) అనే వ్యక్తితో రహస్యంగా పెళ్లి జరిగిందని, ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా డింపుల్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు డింపుల్ హయతి సమాధానమిస్తూ, తనకు ఇప్పటివరకు పెళ్లే కాలేదని, తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇస్తూ, నెటిజన్లను ఇలాంటి రూమర్స్ సృష్టించవద్దని కోరింది. ఇక డింపుల్ హయతి ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
