మన పత్రిక వెబ్‌డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి ఐదవ మరియు చివరి విడతగా రూ. 567.40 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిధులతో కలిపి రాష్ట్రం మొత్తం రూ. 2,600 కోట్ల గ్రాంట్‌ను పూర్తిస్థాయిలో సాధించిందని మంత్రి తెలిపారు.
నిధుల కేటాయింపు ఇలా.. విడుదలైన ఈ నిధులను ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక (PHC), సామాజిక ఆరోగ్య కేంద్రాల (CHC) భవన నిర్మాణాలు, డయాగ్నోస్టిక్ సేవల మెరుగుదలకు వినియోగించనున్నారు.
Advertisement
- రూ. 233.45 కోట్లు: ఆయుష్మాన్ మందిరాలు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ భవనాలకు.
- రూ. 218.11 కోట్లు: వ్యాధి నిర్ధారణ పరీక్షల మౌలిక సదుపాయాలకు.
- రూ. 55.89 కోట్లు: గ్రామీణ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు.
- రూ. 52.71 కోట్లు: పట్టణ ఆరోగ్య సేవలకు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల వినియోగం వేగవంతమైందని, 19 నెలల్లోనే 43% నిధులు సాధించామని అధికారులు మంత్రికి వివరించారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
