మన పత్రిక వెబ్‌డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సేవల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అరచేతిలోనే అన్ని పనులు అయిపోయేలా చర్యలు వేగవంతం చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘మన మిత్ర’ (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మాన్యువల్ సేవలకు చెక్.. అంతా ఆన్లైనే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని మాట్లాడారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ సేవను తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా, ముఖ్యంగా ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారానే అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని శాఖలు మాన్యువల్‌గా సేవలు అందిస్తున్నాయని, ఇకపై అలా కుదరదని తేల్చి చెప్పారు.
ఏప్రిల్ నాటికి ఏఐ టెక్నాలజీ డేటా డ్రివెన్ గవర్నెన్స్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 98 ‘యూస్ కేసెస్’ (Use Cases)ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు భాస్కర్ తెలిపారు.
- ఏప్రిల్ నెలాఖరుకల్లా ఇవి అందుబాటులోకి వస్తాయి.
- ప్రభుత్వ శాఖలు తమకు ఎలాంటి సేవలు కావాలన్నది తెలియజేస్తే, దానికి తగ్గట్టుగా టెక్నాలజీని రూపొందించి ఇస్తామని చెప్పారు.
- వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘అవేర్’తో రియల్ టైమ్ అప్డేట్స్ మరోవైపు ఆర్టీజీఎస్ (RTGS) ఆధ్వర్యంలోని ‘అవేర్’ (AWARE) ప్లాట్‌ఫామ్‌ను అన్ని శాఖలు సమర్థవంతంగా వాడుకోవాలని కోరారు. దీని ద్వారా రియల్ టైమ్‌లో వాతావరణ సమాచారంతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. దీనికోసం ప్రత్యేకంగా 50 యూస్ కేసెస్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. వాట్సాప్‌లోనే అన్ని సేవలు!
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
