రానున్న సంక్రాంతి (Sankranthi) పండుగని పురస్కరించుకొని తెలంగాణ ఎడ్యుకేషనల్ బోర్డు వారు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలకు మరియు ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఒకేసారి సెలవులు ప్రకటించగా, సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇంటర్ విద్యార్థులకు ఎనిమిది రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. తిరిగి జనవరి 19న ఆదివారం కావడంతో 20వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం అవుతాయి.
అయితే తెలంగాణాలోని పాఠశాలలకు (Schools) మాత్రం 10 నుండి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వడం జరిగింది. అంటే సరిగ్గా వారం రోజుల సెలవులు లభించాయన్నమాట. పాఠశాలల సెలవులతో పోల్చితే ఇంటర్ విద్యార్థులకు రెండు రోజులు ఎక్కువ సెలవులు దొరకడం విశేషం. అయితే విద్యార్థులకు మానసిక ఇబ్బంది కలగకూడదని భావించిన ఇంటర్ బోర్డు సెలవు రోజులలో ఏ ఒక్క ఇంటర్ కళాశాలలోనూ తరగతులు నిర్వహించకూడదని హెచ్చరించింది. ఇక పరీక్షలకు ముందు వారం రోజుల సెలవు రోజులను కుటుంబంతో హాయిగా గడిపేందుకు విద్యార్థులకు మంచి సమయం దొరికిందని చెపొచ్చు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
