టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “మన శంకర వర ప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేస్ సినిమాల్లో రాజా సాబ్ రిలీజ్ కాగా, నెక్స్ట్ చిరు మూవీనే రిలీజ్ కానుంది. ఇక విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా, ఆ ఈవెంట్ సక్సెస్ తో మూవీ ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి.
లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి రెండు రోజుల ముందే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్ (500k) మార్క్ దాటేసిందని తెలుస్తుంది. బుకింగ్స్ స్పీడ్ చూస్తుంటే ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే మన శంకర వరప్రసాద్ 1 మిలియన్ డాలర్స్ ఓపెనింగ్స్ కొట్టినా కొట్టొచ్చు, ఇక రాజా సాబ్ లాగే ఈ సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ భారీగా ఉండే ఛాన్స్ ఉంది.
ఇక భోళా శంకర్ డిజాస్టర్ తో కాస్త గ్యాప్ తీసుకున్న చిరు తనకు అచ్చోచ్చిన ఎంటర్టైన్మెంట్ జోన్ తో వస్తున్నాడు, సో ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టి వంద కోట్ల షేర్ ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. దానికి తోడు వెంకీ స్పెషల్ రోల్ MSVP కి మరింత ప్లస్ అవనుంది. మరి ఫస్ట్ డే చిరంజీవి యంగ్ స్టార్స్ కి పోటీ ఇస్తూ ఎంత వసూలు చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
