రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన రాజా సాబ్ (Rajasaab) ఫైనల్ గా సంక్రాంతి కానుకగా నేడు అనగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండే అంతంత మాత్రం అన్న టాక్ తెచ్చుకున్న రాజాసాబ్ తెలుగు రాష్ట్రాల్లో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఆడియన్స్ నుండి మరీ అంత బ్యాడ్ గా లేదన్న టాక్ తెచ్చుకోగా, కొత్తదనం మాత్రం అస్సలు కనిపించకపోగా, లెంగ్తి సీన్స్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టించారు. ఓవరాల్ గా సినిమాని ప్రభాస్ ఒక్కడే వన్ మ్యాన్ షో గా నడిపించాడు. దర్శకుడిగా ఈ సినిమాకి మారుతి (Maruthi) ఫెయిల్ అయ్యాడని, కథ బాగానే రాసుకున్న మారుతి స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తడబడ్డాడని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా రాజా సాబ్ సినిమాకి నిర్మాతలు పీపుల్ మీడియా మేకర్స్ (People Media Makers) ఏకంగా 400 కోట్లు ఖర్చు పెట్టమని, మేకింగ్స్ పై సెట్టింగ్స్ పై చాలా ఖర్చు చేశామని పలు సందర్భాల్లో చెప్పారు. కానీ సినిమాలో చూస్తే అంత ఖర్చు చేసినట్టు కనిపించట్లేదని విమర్శకుల మాట. గ్రాఫిక్స్ ఆ కోట సెట్స్ మినహా, ఎక్కడా ఆకట్టుకునేలా సన్నివేశాలు లేకపోగా, 40 కోట్లతో మిడ్ రేంజ్ హీరోతో చిన్నగా తీయాల్సిన సినిమాని ఓవర్ గా ఖర్చు పెట్టించి మారుతి ఈ కళాఖండాన్ని తీసాడని ట్రేడ్ విమర్శకులు అంటున్నారు.
లాజికల్ గా మాట్లాడుకుంటే కూడా ప్రభాస్ మినహా భారీ స్టార్ డమ్ ఉన్న నటులు ఎవరూ ఈ సినిమాలో లేరు. మరి రెమ్యూనరేషన్ లెక్కేసుకున్నా కూడా ప్రభాస్ కి వంద కోట్లు పొగా, మిగతా నటీనటులకు, మేకర్స్ కి కలిపి మరో వంద కోట్లు వేసుకున్నా కూడా బడ్జెట్ 250 కోట్లు దాటకూడదు. అలాంటిది నాలుగు వందల కోట్ల ఖర్చు ఎలా చేశారన్నది మిస్టరీ అని అంటున్నారు. ఇదంతా పక్కన బెడితే ఫస్ట్ డే రాజా సాబ్ టాక్ తో సంబంధం లేకుండా మరోసారి 100 కోట్ల ఓపెనింగ్స్ తొలిరోజే కొట్టడానికి రెడీ అవుతున్నాడు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
