మన పత్రిక, వెబ్‌డెస్క్
Google gmail data breach warning – జీమెయిల్ వినియోగదారులు వెంటనే తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని గూగుల్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది జీమెయిల్ ఖాతాల భద్రత ప్రమాదంలో ఉందని గూగుల్ హెచ్చరించింది. ఈ ప్రమాదానికి కారణం సేల్స్‌ఫోర్స్ డేటా బ్రీచ్ అని గూగుల్ తెలిపింది. 2025 జూన్ ప్రథమార్థంలో జరిగిన ఈ ఘటన తర్వాత హ్యాకర్స్ వినియోగదారుల సమాచారాన్ని పొందినట్లు సమాచారం.
హ్యాకర్స్ ఇప్పుడు వినియోగదారులకు కాల్స్ మరియు మెసేజ్‌లు పంపుతూ పాస్వర్డ్ రీసెట్ చేయమని లేదా లాగిన్ కోడ్స్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందేశాలకు స్పందించకుండా ఉండాలని గూగుల్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి నేపథ్యంలో జీమెయిల్ పాస్‌వర్డ్‌ను తక్షణమే మార్చుకోవడం చాలా ముఖ్యం. బలమైన పాస్వర్డ్ మరియు రెండు-దశల ధృవీకరణను ఉపయోగించమని గూగుల్ సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
