తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే పరీక్షల హడావిడి మొదలు కానుంది. అకాడమిక్ ఇయర్ 2025-26 ముగింపుకు వచ్చేయగా, ఎంతో మంది విద్యార్థులు పాస్ అవ్వాలని పుస్తకాలు పట్టుకుంటే, నిరుద్యోగులు ఎలాగైనా జాబ్ సంపాదించాలని కసితో పుస్తకాలు తిరగేస్తున్నారు. ఇదిలా ఉండగా గతేడాది చివర్లో దేశవ్యాప్తంగా పలు కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు అడ్మిషన్లకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. అయితే ఈ పరీక్షలు ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉండబోతున్నాయి. ఈ క్రమంలో జనవరి, ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో జరగనున్న ఉద్యోగాల, ప్రవేశ పరీక్షలు ఎప్పుడు, ఏ తేదీల్లో జరగనున్నాయో కింద తెలుసుకోవచ్చు.
జనవరి – ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షలు.. తేదీలు
Telangana TET : తెలంగాణ టెట్ పరీక్షలు : జనవరి 3 నుంచి 20 వరకు
SSC CGL టైర్ 2 పరీక్షలు : జనవరి 18, 19 తేదీలు
AISSEE సైనిక్ స్కూల్- 2026 పరీక్ష : జనవరి 18
JEE మెయిన్ సెషన్ 1 పరీక్షలు : జనవరి 21 నుంచి 29 వరకు
Navodaya నవోదయ 9, 11వ తరగతి ప్రవేశ పరీక్ష: ఫిబ్రవరి 7
GATE గేట్-2026 పరీక్ష : ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు
RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్షలు : ఫిబ్రవరి 11, 12 తేదీల్లో
SSC 25,487 జీడీ కానిస్టేబుల్ పరీక్ష: ఫిబ్రవరి 23
Forest Section Officer ఆఫీసర్ పరీక్షలు : ఫిబ్రవరి 12, 13 తేదీల్లో
AP Agriculture Officer పరీక్షలు: జనవరి 27, 28 తేదీల్లో
AP Technical Officer : పరీక్షలు: జనవరి 27, 28 తేదీల్లో
AP Junior Lecturer (లైబ్రేరియన్ సైన్స్) పరీక్షలు: జనవరి 27, 28 తేదీల్లో
ఇవే గాక ఏపీ ప్రభుత్వ శాఖల్లో మరెన్నో ఉద్యోగాల ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
