మన పత్రిక, వెబ్‌డెస్క్
కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ( PMVBRY ) అధికారిక పోర్టల్‌ను ప్రారంభించారు. పోర్టల్ pmviksitbharatrozgaryojana.com ఆగస్టు 18 నుంచి అందుబాటులో ఉంది.
ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు ఎన్రోల్ అయిన కొత్త ఉద్యోగులు, యజమానులు ప్రయోజనాల కోసం పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా UAN అప్లోడ్ చేయాలి. ఈ పథకం ప్రకారం మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి రూ. 15,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది ఒక నెల సగటు వేతనం (బేసిక్ + DA) గా రెండు విడతల్లో చెల్లిస్తారు.
పథకం రెండు భాగాలు: పార్ట్-ఏ (ఉద్యోగులు), పార్ట్-బీ (యజమానులు). యజమానులు కొత్త ఉద్యోగులను నియమిస్తే జీతం ఆధారంగా రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈపీఎఫ్ ( EPFO ) మినహాయింపు సంస్థలకు కూడా పథకం వర్తిస్తుంది. కానీ ECR దాఖలు చేయాలి. ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ ఓపెన్ చేయాలి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 వరకు 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా రూ. లక్ష కోట్లు కేటాయించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
