మన పత్రిక, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా ఎక్కువ కాలం వినియోగంలో లేని ఖాతాలపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకోనున్నాయి.
వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని ‘డోర్మెంట్ ఖాతాలు’, గత 12 నెలలుగా వాడని ‘ఇన్‌యాక్టివ్ ఖాతాలు’, అలాగే చాలా కాలంగా సున్నా బ్యాలెన్స్ ఉండి KYC అప్డేట్ చేయని ఖాతాలపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాయి. నిబంధనల ప్రకారం వీటిని మూసివేసే ప్రమాదం ఉంది. మీ ఖాతా సురక్షితంగా ఉండాలంటే వెంటనే ఒక చిన్న లావాదేవీ (UPI లేదా ATM విత్ డ్రాయల్) చేయాలని, KYC వివరాలు సరిచూసుకోవాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
