Advertisement

XUV 7XO: మహీంద్రా లాంచ్.. ఫ్యామిలీస్ కోసం బెస్ట్ SUV ఇదేనా?

మన పత్రిక, వెబ్​డెస్క్: కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మహీంద్రా నుంచి మోస్ట్ అవైటెడ్ ఎస్‌యూవీ ‘ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ’ (XUV 7XO 2026) రేపు (జనవరి 5న) భారత మార్కెట్లోకి విడుదల కానుంది. పాపులర్ ఎక్స్​యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వస్తున్న ఈ కారులో విప్లవాత్మక మార్పులు ఉండనున్నాయి. ఇప్పటికే రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

XUV 7XO హైలైట్స్ ఇవే:

Advertisement
  • ఎక్స్‌టీరియర్: ఇది సరికొత్త ‘రెడ్’ కలర్ వేరియంట్‌లో రానుంది. ముందు వైపు కొత్త గ్రిల్, స్లీక్ ఎల్‌ఈడీ లైట్లు, అగ్రెసివ్ బంపర్, 18-ఇంచ్ అలాయ్ వీల్స్‌తో చాలా బోల్డ్‌గా కనిపిస్తుంది.
  • ట్రిపుల్ స్క్రీన్ సెటప్: ఇంటీరియర్‌లో ప్రధాన ఆకర్షణ మూడు స్క్రీన్లు. ఒకటి ఇన్‌ఫోటైన్‌మెంట్, రెండు డ్రైవర్ డిస్‌ప్లే, మూడు కంట్రోల్స్ కోసం ఉంటాయి. క్యాబిన్ వైట్ థీమ్‌తో ప్రీమియం లుక్‌ని ఇస్తుంది.
  • అదిరిపోయే ఫీచర్లు: 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 16-స్పీకర్ల హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, వెనుక సీట్లకు కూడా వె వెంటిలేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం విశేషం.
  • సేఫ్టీ: ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 540-డిగ్రీ కెమెరా, ADAS లెవల్-2 (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్) వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.

Xuv 7xo price – ధర (అంచనా) : ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 15 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement