మన పత్రిక, వెబ్‌డెస్క్: ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై తొలి విమానం దిగనుంది. ట్రయల్ రన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడతలో 96 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 2203 ఎకరాల్లో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది.
అబ్బురపరిచే విశేషాలు:
Advertisement
- ప్రత్యేక డిజైన్: సముద్ర తీర ప్రాంతం కావడంతో టెర్మినల్‌ను ‘నీటిలో నుంచి ఎగిరే చేప’ ఆకారంలో నిర్మించారు. ఫ్లోరింగ్, సీలింగ్ అచ్చమైన ఆంధ్ర స్టైల్ ముత్యాల ముగ్గులతో ముస్తాబు చేశారు.
- సామర్థ్యం: తొలి దశలో ఏటా 60 లక్షల (6 మిలియన్) మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా 22 కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాలు కల్పించారు.
- సేఫ్టీ ఫస్ట్: హుద్‌హుద్ వంటి తుఫాన్లను దృష్టిలో పెట్టుకుని.. గంటకు 295 కి.మీ వేగంతో గాలులు వీచినా, 270 మి.మీ వర్షం కురిసినా చెక్కు చెదరని రీతిలో దీన్ని నిర్మించారు. టెర్మినల్ అద్దాలు 45 మిల్లీమీటర్ల మందంతో పటిష్టంగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
