మన పత్రిక, వెబ్‌డెస్క్: సినీ నటి సౌందర్య మరణం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే ఉంటుంది. 2004 ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదానికి రెండు రోజుల ముందు (ఏప్రిల్ 15, 2004) జరిగిన ఓ సంఘటన, అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది.
అప్పట్లో బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తేజా టీవీకి చెందిన సిబ్బంది ఆయన ప్రచారాన్ని కవర్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయంలో కెమెరామన్ కెమెరాను ఆఫ్ చేయడం మర్చిపోవడంతో, విద్యాసాగర్ రావుకు వచ్చిన ఓ ఫోన్ కాల్ సంభాషణ రికార్డయింది. అది సౌందర్య సోదరుడు అమర్ నాథ్ నుంచి వచ్చిన కాల్.
ఆ కాల్లో ఏముందంటే..: సౌందర్య ప్రచారానికి రావడానికి హెలికాప్టర్ కావాలని అమర్ నాథ్ కోరగా.. విద్యాసాగర్ రావు స్పందిస్తూ.. “నాకు ఖర్చు ముఖ్యం కాదు. ఈ ఎన్నికల సమయంలో సరైన కండిషన్లో ఉన్న హెలికాప్టర్ దొరకడమే సమస్య. మీరు తప్పనిసరి అంటే బెంగళూరులో మంచి కండిషన్లో ఉన్నదాన్ని చూసుకోండి” అని సూచించారు.
దురదృష్టవశాత్తు ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ప్రమాదానికి గురై సౌందర్య, ఆమె సోదరుడు మరణించారు. సౌందర్య మరణానికి విద్యాసాగర్ రావు కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో.. అనుకోకుండా రికార్డయిన ఈ టేప్ బయటకు రావడం సంచలనం సృష్టించింది. హెలికాప్టర్ కండిషన్ గురించి విద్యాసాగర్ రావు ముందే హెచ్చరించారని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసింది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
