మన పత్రిక, వెబ్డెస్క్: సామాన్యుల చూపు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలపై పడింది. ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో రాబోయే కొత్త ఏడాది (జనవరి 1) సందర్భంగా గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
గత నెలలో వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు స్వల్పంగా తగ్గించి ఊరటనిచ్చాయి. అయితే, గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్ ధరల్లో మాత్రం పెద్దగా మార్పులు లేవు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా ఈసారి రేట్లు పెరుగుతాయా? లేక తగ్గుతాయా? అనేది చూడాలి. ఇకపై నెలనెలా గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయని కంపెనీలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
