మన పత్రిక, వెబ్డెస్క్: బీహార్‌లోని ఛాప్రాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉండటం స్థానికులను కలచివేసింది.
గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వెలువడిన ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ వాయువు గది అంతా వ్యాపించింది. నిద్రలోనే ఆ విషవాయువును పీల్చడంతో వారంతా ఊపిరాడక, స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- HYDRAA Jobs: సరూర్నగర్ స్టేడియం వద్ద భారీగా నిరుద్యోగులు.. తోపులాట
- Telangana Rain Forecast: తెలంగాణలో మళ్లీ వానలు.. పలు జిల్లాలకు వర్ష సూచన
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ మంచి వసూళ్లు
- జాన్వీ కపూర్, శ్రీలీల కాంబినేషన్లో హిందీ రొమాంటిక్ థ్రిల్లర్
- సన్ నెక్స్ట్లోకి లోకేష్ కనగరాజ్ ‘డిసి’ డిజిటల్ హక్కులు
