బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో సల్మాన్ మునుపెన్నడూ చూడని సీరియస్ ఆర్మీ ఆఫీసర్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. “చావుకి భయం ఎందుకు.. అది ఎలాగైనా వస్తుంది” అనే డైలాగ్ టీజర్లో హైలైట్‌గా నిలిచింది.
2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గల్వాన్ పోరాటంలో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, హిమేష్ రేషమియా సంగీతం అందిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
