రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. తాజాగా వివిధ సంస్థలకు 49.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాసిల్ వుడ్స్, సెయింట్ మేరీస్ స్కూల్, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్, బ్యాంకులు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం 12.66 ఎకరాలను కేటాయించారు. గతంలో ఇచ్చిన 42.30 ఎకరాల్లో స్వల్ప మార్పులు చేశారు.
మరోవైపు, ప్రతిష్టాత్మక హైకోర్టు నిర్మాణంలో కీలకమైన ర్యాప్తు (Raft) పనులను మంత్రి నారాయణ గురువారం రాత్రి ప్రారంభించారు. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 కోర్టు హాళ్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఎనిమిదో అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందని, 2027 చివరి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
