మన పత్రిక, వెబ్డెస్క్: రాంచీ వేదికగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ జట్టు పరుగుల వరద పారించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇంత భారీ స్కోరు చేయలేదు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బిహార్ బ్యాటర్లు అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ వైభవ్ 190 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా, ఆయూష్ ఆనంద్ 56 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ సకిబుల్ గని కేవలం 39 బంతుల్లో 128 పరుగులతో అజేయంగా నిలిచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
