మన పత్రిక, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పథకాల నుంచి సిమ్ కార్డు వరకు ప్రతిదానికీ ఇప్పుడు ఆధార్ (Aadhaar) తప్పనిసరి. అయితే, ఆధార్ సేవలు పొందేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడటం, కేంద్రాల చుట్టూ తిరగడం చాలా మందికి ఇబ్బందిగా మారింది. ఇటువంటి వారికి UIDAI గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 50 ఖర్చుతో ఇంటి నుంచే ఆధార్ సేవలు పొందే వెసులుబాటు కల్పించింది.
ఆన్‌లైన్ విధానం ఇలా:
Advertisement
- వెబ్‌సైట్: ముందుగా
myaadhaar.uidai.gov.inవెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - ప్రాసెస్: ‘కొత్త ఆధార్’ లేదా ఇతర సేవలను ఎంచుకుని, అవసరమైన వివరాలు నింపాలి. పేరు, చిరునామా, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను (ID Proofs) ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు: ఈ సేవకు కేవలం రూ. 50 ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది.
- అపాయింట్‌మెంట్: ఒకవేళ బయోమెట్రిక్స్ (వేలిముద్రలు, ఐరిస్) అవసరమైతే, మీకు నచ్చిన తేదీన అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని కేంద్రానికి వెళ్లవచ్చు. ప్రక్రియ పూర్తయ్యాక కొద్ది రోజుల్లోనే ఆధార్ కార్డు పోస్టులో నేరుగా మీ ఇంటికి వస్తుంది.
దీంతో దళారుల బెడద లేకుండా, సమయం వృధా కాకుండా సులభంగా ఆధార్ కార్డును పొందవచ్చు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
