మన పత్రిక, వెబ్‌డెస్క్: వాహనదారులకు శుభవార్త. డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ఆధార్ కార్డు ఉంటే చాలు, లెర్నర్ లైసెన్స్ (LL) కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా:
Advertisement
- వెబ్సైట్: ముందుగా
parivahan.gov.inవెబ్సైట్లోకి వెళ్లి, ‘ఆన్లైన్ సర్వీసెస్’లో ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్’ ఎంచుకోవాలి. - ఆధార్ ప్రామాణికత: రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత, ‘అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్’ పై క్లిక్ చేసి, ఆధార్ ద్వారా వివరాలను ధృవీకరించాలి.
- ఆన్లైన్ పరీక్ష: ఫారమ్ నింపి, ఫీజు చెల్లించిన తర్వాత ఆన్లైన్లోనే లెర్నర్ లైసెన్స్ పరీక్ష రాయవచ్చు. ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్‌పై ఉండే ఈ పరీక్షలో పాస్ అయితే లెర్నర్ లైసెన్స్ జారీ అవుతుంది.
ముఖ్య గమనిక: లెర్నర్ లైసెన్స్ వచ్చిన తర్వాత, నిర్ణీత గడువులోగా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసి, శాశ్వత లైసెన్స్ (Permanent DL) కోసం మాత్రం తప్పనిసరిగా ఆర్టీవో (RTO) కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
