నేడు (డిసెంబర్ 21) గ్రహస్థితి ఎలా ఉంది? ఆదివారం నాడు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి శ్రమ తప్పదు? ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం.
మన పత్రిక, వెబ్డెస్క్: మేష రాశి వారికి కాలం మిశ్రమంగా ఉంది. మనోబలంతో చేసే పనులు మాత్రమే ఫలిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం ఈరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించడం శుభప్రదం.
వృషభ రాశి వారు మనోబలంతో చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగితే కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. వ్యాపారంలో మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. సూర్యధ్యానం చేయడం మంచిది.
మిథున రాశి వారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కీలక విషయాల్లో తోటి వారి సలహాలు తీసుకోవడం అవసరం. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యారాధన శుభప్రదం.
కర్కాటక రాశి వారు అనుకున్న పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. మనోధైర్యమే మీకు ప్రధాన బలం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. పట్టుదలతో పనిచేస్తే మంచిపేరు వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడతాయి. నవగ్రహ ఆరాధన శ్రేయస్కరం.
సింహ రాశి వారికి కాలం మిశ్రమంగా కొనసాగుతోంది. శ్రమతో కూడిన ఫలితాలు లాభిస్తాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. దుర్గాస్తోత్రం చదవడం మేలు చేస్తుంది.
కన్య రాశి వారు ప్రారంభించిన పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. బద్ధకించకుండా పనులు వెంటనే పూర్తి చేయడం మంచిది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా వ్యవహరించాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి, మనోధైర్యం పెరుగుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
తుల రాశి వారికి కాలం ఎంతో శుభప్రదంగా ఉంది. ఏ పని చేసినా త్వరగా పూర్తవుతుంది. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నది దక్కుతుంది. ఒక సంఘటన మీ మానసిక బలాన్ని పెంచుతుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి వారికి గ్రహబలం కొంత బలహీనంగా ఉంది. అందుకే ప్రతి పనిలో పట్టుదల అవసరం. పనుల్లో ఆలస్యం జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఏకాగ్రత లేకపోతే చేసిన పనే మళ్లీ చేయాల్సి వస్తుంది. అజాగ్రత్తకు అస్సలు తావివ్వకండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మంచిది.
ధనుస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. మీ సకారాత్మక ఆలోచనలు విజయాన్ని అందిస్తాయి. ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో సహాయం లభిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. సౌభాగ్యసిద్ధి కలుగుతుంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి తగిన సహాయం అందుతుంది. దుర్గాదేవి నామస్మరణ మేలు చేస్తుంది.
కుంభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుచూపుతో వ్యవహరించడం అవసరం. మీ పనులకు దైవబలం తోడుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కీలక సందర్భాల్లో ఇతరుల సలహాలు మేలు చేస్తాయి. నమ్మకంతో ముందుకు సాగాలి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మీన రాశి వారిని ఆత్మవిశ్వాసం కాపాడుతుంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల ప్రేమాభిమానాలు లభిస్తాయి. భోజన సౌఖ్యం కలుగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
