మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్ల పదవీ బాధ్యతల స్వీకరణ (Appointment Day) తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా, దానిని డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కారణం ఇదే: డిసెంబర్ 20న మంచి ముహూర్తాలు లేకపోవడంతో, తేదీని మార్చాలని పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు స్పందించిన అధికారులు, కొత్త తేదీని డిసెంబర్ 22గా ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూతన సర్పంచ్‌లందరూ అదే రోజున తమ పదవీ బాధ్యతలను స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
