మన పత్రిక, వెబ్‌డెస్క్: సామాన్యులకు వంట గ్యాస్ భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (PMUY) ద్వారా అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు, కేవలం రూ. 550కే సిలిండర్ (ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ) అందిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది దీని ద్వారా లబ్ధి పొందారు.
అర్హతలు: ఈ పథకానికి భారతీయ పౌరసత్వం ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలు మాత్రమే అర్హులు. వారు బీపీఎల్ (BPL) కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు, పీఎం ఆవాస్ యోజన, అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరి.
దరఖాస్తు విధానం: అర్హులు ఉజ్వల యోజన 2.0 వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేవైసీ వివరాలు నింపి, గ్యాస్ ఏజెన్సీని ఎంచుకోవాలి. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో సమర్పిస్తే కనెక్షన్ మంజూరు చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
