మన పత్రిక, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘కౌశలం’ (Work From Home Job Skill Test) అసెస్‌మెంట్ పరీక్షలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. (AP kaushalam exam date ) డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతంలో సాంకేతిక సమస్యలు, సిస్టమ్ ఎర్రర్లు లేదా సెలవుల కారణంగా పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం.
అభ్యర్థులు తమ సొంత గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోనే ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. ప్రతీరోజూ రెండు స్లాట్లలో (ఉదయం 11:00 గంటల నుంచి 12:00 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 4:00 గంటల వరకు) పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ పేరు, మొబైల్ నంబర్ లేదా సచివాలయం కోడ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో తమ పరీక్ష తేదీ, సమయం వివరాలను సరిచూసుకోవచ్చు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
