Advertisement

సర్పంచ్ అభ్యర్థిపై కారం పొడితో దాడి!

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేళ కలకలం రేగింది. శంకరపట్నం మండలం మొలంగూర్‌లో సర్పంచ్ అభ్యర్థి కొమురయ్యపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం.. కొమురయ్యను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందుగా ఆయన కళ్లలో కారం పొడి చల్లి, ఆపై దాడికి తెగబడ్డారు. ఊహించని పరిణామంతో బాధితుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొమురయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement