మన పత్రిక, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో (Nalgonda District) ఓ యువతి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన బోయపల్లి అనూష (21) ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగం సాధించినప్పటికీ, ప్రజాసేవపై మక్కువతో ఆ కార్పొరేట్ ఆఫర్‌ను తిరస్కరించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.
బీఆర్ఎస్ (BRS) మద్దతుతో పోటీ చేసిన అనూష, సీనియర్ నాయకురాలిపై 182 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పిన్న వయసులోనే సర్పంచ్ గా గెలిచి గ్రామస్థుల మన్ననలు పొందారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తేనే గ్రామాల రూపురేఖలు మారుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని అనూష ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
