మన పత్రిక, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాంకేతిక కారణాలతో ‘కౌశలం’ (Work From Home Job Skill Test) పరీక్ష రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు డిసెంబర్ 12, 2025 వరకు పరీక్షలు నిర్వహించేలా రీ-షెడ్యూల్ విడుదల చేసింది.
ఎవరికి అర్హత? మొదటి విడతలో సర్వర్ సమస్యలు, లాగిన్ ఇబ్బందులు లేదా వ్యక్తిగత కారణాల వల్ల పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష రాయవచ్చు. సొంత గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఈ పరీక్షలు జరుగుతాయి.
Advertisement
పరీక్ష సమయాలు: రోజూ రెండు షిఫ్టుల్లో (ఉదయం 11:00-12:00, మధ్యాహ్నం 3:00-4:00) పరీక్ష ఉంటుంది. మొత్తం 60 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్ట్ (45 నిమిషాలు), కమ్యూనికేషన్ టెస్ట్ (15 నిమిషాలు) నిర్వహిస్తారు. ఆధార్ కార్డుతో హాజరుకావాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
