మన పత్రిక, వెబ్డెస్క్: సామాన్యులకు తపాలా శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. అత్యంత తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఖమ్మంలో జరిగిన అవగాహన సదస్సులో పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఈ కీలక వివరాలను వెల్లడించారు.
ప్రధానంగా గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ కింద కేవలం రూ. 750 చెల్లిస్తే ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అలాగే రూ. 550 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా సౌకర్యం పొందవచ్చు. తొలుత రూ. 200తో ఖాతా తెరిచి ఈ పాలసీలను ఎంచుకోవచ్చు. దీంతో పాటు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్ ఖాతాలపై 4% వడ్డీ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
