మన పత్రిక, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 9 (bigg boss 9 telugu) తుది దశకు చేరుకుంటున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో ‘రీతూ చౌదరి’ హౌస్ నుంచి బయటకు వచ్చారు. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రీతూ ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు.
ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన రీతూ (Rithu Chowdary).. హౌస్ మేట్స్ కు తనదైన శైలిలో ర్యాంకులు ఇచ్చారు. భరణికి చివరి స్థానం (7) ఇవ్వగా, డిమోన్ పవన్ నంబర్ వన్ (1) స్థానంలో నిలుస్తాడని జోస్యం చెప్పారు. పవన్ కచ్చితంగా టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తూ, కప్పుతో తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. సంజనా, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ లకు తదుపరి స్థానాలు కేటాయించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
